A place where you need to follow for what happening in world cup

- Advertisement -

నెహ్రూనగర్‌లో ఉచిత వైద్య శిబిరం

0 61

నెహ్రూనగర్‌లో ఉచిత వైద్య శిబిరం
– ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి-విశాల భారతి
నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నెహ్రూనగర్‌లో స్థానిక నాయకుడు దేవులపల్లి శ్రీకాంత్ ఆధ్వర్యంలో, శ్రీ వేద మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. నిరుపేదలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వేద హాస్పిటల్ ఎండీ అరవింద్ రెడ్డి, డాక్టర్ పూర్ణిమ, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, నర్సింహా, హరి, ప్రదీప్, మహేందర్ సింగ్, రవీందర్, సైదులు యాదవ్, సలీం, సల్మాన్, షైబాజ్, రఘు, సూరి, రాజేష్, వినయ్, నాందేవ్, ఆసుపత్రి వైద్య సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.