ఉడమ్‌గడ్డలో గుట్కా కలకలం
– లారీని తనిఖీ చేయగా 52 బ్యాగుల గుట్కా స్వాధీనం
రాజేంద్రనగర్ – విశాలభారతి
మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉడమ్‌గడ్డలో భారీగా గుట్కా పట్టుబడింది. జీఎంఆర్ పార్కింగ్ ప్రాంతంలో రెండు రోజులుగా అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన లారీని స్థానికుల సమాచారంతో పోలీసులు తనిఖీ చేశారు. లారీలో 52 బ్యాగుల గుట్కా ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.ఒక్కో బ్యాగులో సుమారు 50 కిలోల వరకు గుట్కా ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి సయ్యద్ అన్వర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గుట్కాను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి తరలించేందుకు సిద్ధం చేశారు, దీని వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
