A place where you need to follow for what happening in world cup

- Advertisement -

ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

0 136

– పలు కాలనీల్లో జెండా ఆవిష్కరణ చేసిన టీపీసీసీ ప్రతినిధులు జక్కిడి ప్రభాకర్ రెడ్డి, జక్కిడి సత్య తేజ రెడ్డి

విశాలభారతి, అబ్దుల్లాపూర్మెట్ : 77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టీపీసీసీ ప్రతినిధులు జక్కిడి ప్రభాకర్ రెడ్డి , జక్కిడి సత్య తేజ రెడ్డి ఎల్‌బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీలు, కార్మిక సంఘాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.మన్సూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట జెట్టి అశోక్ యాదవ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరణ అనంతరం వారు మాట్లాడారు. 1947లో బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిందని, 1950లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రూపకల్పన చేసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునే భారత్ గణతంత్ర దేశంగా అవతరించిందని తెలిపారు. అందుకే ప్రతి భారతీయుడు జనవరి 26వ తేదీని పండుగలా జరుపుకుంటున్నాడని అన్నారు.ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు జెట్టి అశోక్ యాదవ్, అంజి యాదవ్, విట్టల్ రెడ్డి, అమర్ గౌడ్, యంజాల రమేష్, కన్న, రాజి రెడ్డి, యంజాల టిల్లు, నవీన్ యాదవ్, గంగయ్య, ఏనుగు జంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు బండ శ్యాంసుందర్ రెడ్డి, ఎర్రబెల్లి సతీష్ రెడ్డి, మున్నా జానీ, రాజేందర్ యాదవ్, పృది రాజ్, రఘు, మహిళా నాయకులు ప్రమీల, లక్ష్మి, అలాగే ఎల్‌బీ నగర్ నియోజకవర్గంలోని వివిధ కాలనీల సంక్షేమ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.