పాల్వంచ: విశాలభారతి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంట గ్రామ సమీపంలో చెత్త తరలింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామ సమీపంలో మున్సిపల్ అధికారులు విచ్చలవిడిగా చెత్తను కుమ్మరిస్తుండటం, సాయంత్రం వేళల్లో ఆ చెత్తకు నిప్పు పెడుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని నిరసిస్తూ శనివారం గ్రామస్తులు చెత్త తరలిస్తున్న మున్సిపల్ వాహనాలను అడ్డుకొని ఆందోళనకు దిగారు.
పొగతో ఉక్కిరిబిక్కిరి. అనారోగ్యంపై ఆందోళన
గ్రామస్తుల కథనం ప్రకారం.మున్సిపాలిటీకి చెందిన చెత్తనంతా ఎర్రగుంట సమీపంలోనే వేస్తున్నారు. సాయంత్రం కాగానే ఈ చెత్త కుప్పలకు నిప్పు పెట్టడంతో విషపూరితమైన పొగ ఊరంతా కమ్ముకుంటోంది. దీనివల్ల:
గ్రామమంతా పొగతో నిండిపోయి శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతోంది.చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్రమైన దగ్గు, శ్వాసకోస సమస్యలతో అనారోగ్యం పాలవుతున్నారు.దుర్వాసనతో ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఏర్పడింది.చెత్త బండ్ల ముట్టడించారుఅధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పలితం లేకపోవడంతో, ఆగ్రహించిన గ్రామస్తులు ఈరోజు చెత్త తరలిస్తున్న ట్రాక్టర్లను, వాహనాలను నిలిపివేశారు. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు, ఇక్కడ చెత్త వేయడం ఆపేవరకు కదిలేది లేదని గ్రామస్తులు భీష్మించుకు కూర్చున్నారు.
