A place where you need to follow for what happening in world cup

- Advertisement -

కెపిహెచ్‌బి ఎస్‌హెచ్‌ఓగా జి.విజయ్‌కుమార్ బాధ్యతల స్వీకరణ

0 253

కెపిహెచ్‌బి ఎస్‌హెచ్‌ఓగా జి.విజయ్‌కుమార్ బాధ్యతల స్వీకరణ

సైబరాబాద్ – విశాల భారతి
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ కొత్త స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా జి.విజయ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు.ఇటీవల సైబరాబాద్ పోలీస్ కమిషనర్ జారీ చేసిన 55 మంది ఇన్స్పెక్టర్ల బదిలీల ఉత్తర్వుల్లో భాగంగా సైబర్ క్రైమ్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న విజయ్‌కుమార్‌ను కెపిహెచ్‌బి ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన కెపిహెచ్‌బి పీఎస్‌లోని తన కార్యాలయంలో విధులు ప్రారంభించారు.కెపిహెచ్‌బి ప్రాంతం అత్యధిక జనాభా, ఐటీ ఉద్యోగులు నివసించే కీలక ప్రాంతం కావడంతో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతానని విజయ్‌కుమార్ తెలిపారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌ల నియంత్రణ, మహిళలు, సీనియర్ సిటిజన్ల భద్రతకు పెద్దపీట వేస్తానని పేర్కొన్నారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి, కమ్యూనిటీ పోలీసింగ్‌ను బలోపేతం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.సైబరాబాద్ పరిధిలో సమర్థవంతమైన పోలీసింగ్ కోసం చేపట్టిన ఈ బదిలీల్లో భాగంగా విజయ్‌కుమార్ వెంటనే కొత్త బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.