A place where you need to follow for what happening in world cup

- Advertisement -

మధాపూర్ ఎస్‌హెచ్‌ఓగా కె.వి. సుబ్బారావు బాధ్యతల స్వీకరణ

0 244

మధాపూర్ ఎస్‌హెచ్‌ఓగా కె.వి. సుబ్బారావు బాధ్యతల స్వీకరణ
– ఐటీ కారిడార్‌లో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి

సైబరాబాద్ -విశాల భారతి
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మధాపూర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌ఓ)గా కె.వి. సుబ్బారావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల సైబరాబాద్ కమిషనర్ జారీ చేసిన 55 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీల ఉత్తర్వుల మేరకు కూకట్‌పల్లి ఎస్‌హెచ్‌ఓగా పనిచేసిన ఆయనను మధాపూర్‌కు బదిలీ చేశారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీసు అధికారులతో సమావేశమైన సుబ్బారావు, ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడంతో పాటు చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఐటీ సంస్థలు అధికంగా ఉన్న మధాపూర్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, సైబర్ నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు పోలీసులతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని కోరారు.వివిధ కీలక పోలీస్ స్టేషన్లలో సేవలందించిన అనుభవం కలిగిన సుబ్బారావు బాధ్యతలు చేపట్టడంతో పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త బాధ్యతల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.