A place where you need to follow for what happening in world cup

- Advertisement -

భూదాన్ భూముల సమస్య పరిష్కారానికి కృషి

0 214

భూదాన్ భూముల సమస్య పరిష్కారానికి కృషి
– 800 మంది లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటా
– టిపిసిసి ఉపాధ్యక్షుడు బండి రమేష్

కూకట్‌పల్లి- విశాల భారతి
మూసాపేట ఆంజనేయ నగర్‌లో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూదాన్ భూముల సమస్యను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని పీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇంచార్జి బండి రమేష్‌ను భూదాన్ లబ్ధిదారులు కోరారు. శుక్రవారం మూసాపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ, సుమారు 17 ఎకరాల భూదాన్ భూమిని కొందరు ఐడిపియల్ ఉద్యోగుల అండతో అక్రమంగా కబ్జా చేశారని ఆరోపించారు. అసలు హక్కుదారులను బెదిరింపులకు గురిచేస్తున్నారని, హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు సమస్య పరిష్కారంపై చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.బాధితుల వినతిని పూర్తిగా విన్న బండి రమేష్ వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్రమాలకు లేదా ఎలాంటి ఒత్తిళ్లకు అధికారులు లొంగితే పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. భూదాన్ భూముల అసలైన హక్కుదారులైన సుమారు 800 మంది లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గొట్టుముక్కల వెంకటేశ్వరావు, ఖలీమ్ ఖాన్, ఫాల్గుణ రావు, చందర్రావు, వాసు, నారాయణ, ఆంజనేయులు, రఘువీర్, మల్లికార్జున్, వాణి, కనకమ్మ, వజ్రం తదితర భూదాన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.