A place where you need to follow for what happening in world cup

- Advertisement -

కుటుంబ కలహాలతో గచ్చిబౌలిలో మహిళ ఆత్మహత్య!

0 181

​కుటుంబ కలహాలతో గచ్చిబౌలిలో మహిళ ఆత్మహత్య!

​సైబరాబాద్ – విశాల భారతి
కుటుంబ కలహాల కారణంగా మనస్థాపానికి గురై ఓ వివాహిత అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…​బీహార్ రాష్ట్రానికి చెందిన అరుణ (37)కు తొమ్మిదేళ్ల క్రితం అన్మోల్ కుమార్‌తో వివాహమైంది. అన్మోల్ కుమార్ ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తుండగా, అరుణ గృహిణి. గత ఏడేళ్లుగా ఈ దంపతులు తమ కుమార్తెతో కలిసి మసీద్‌బండలోని ‘అపర్ణ సేరెన్’ (శరన్ గ్రేటర్ కమిటీ) అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. అయితే, వీరి ఆరేళ్ల కుమార్తె ఆటిజం (మానసిక వికలాంగత్వ సమస్య)తో బాధపడుతోంది.​కూతురి అనారోగ్య సమస్యల విషయమై గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన అరుణ, శనివారం తెల్లవారుజామున తాను ఉంటున్న అపార్ట్‌మెంట్ 12వ అంతస్తు నుంచి కిందకు దూకేసింది. తీవ్ర గాయాలవ్వడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.​సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు జరుపుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.