కిరాణా దుకాణంలో చోరీ
– రూ.20 వేల నగదు, సిగరెట్ల ప్యాకెట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
సైబరాబాద్ – విశాల భారతి
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్‌లో డయల్ ట్రేడర్స్ కిరాణా దుకాణంలో చోరీ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున షట్టర్ తాళాలు పగులగొట్టి రూ.20 వేల నగదు, సిగరెట్ ప్యాకెట్లను దుండగులు ఎత్తుకెళ్లారు.హెచ్‌ఎంటీ సొసైటీకి చెందిన యజమాని ముర్జీ రామ్ మంగళవారం రాత్రి 10 గంటలకు దుకాణం మూసివేసి వెళ్లారు. బుధవారం ఉదయం 5.30కు రమేష్ కచావా ఫోన్ చేసి షట్టర్ తెరిచి ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు వచ్చి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. క్యాష్ డ్రాలోని రూ.20 వేలు, గోల్డ్ ఫ్లేక్ స్మాల్ 2 బాక్సులు, బిగ్ 2 బాక్సులు చోరీ అయ్యాయి.బాధితుడు జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
