A place where you need to follow for what happening in world cup

- Advertisement -

డ్రగ్స్‌కు నో చెప్పేందుకు జీడిమెట్లలో వాలీబాల్ టోర్నీ

0 46

డ్రగ్స్‌కు నో చెప్పేందుకు జీడిమెట్లలో వాలీబాల్ టోర్నీ
– అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీసుల చొరవ

సైబరాబాద్ – విశాల భారతి
యువతను డ్రగ్స్ మాయలో పడకుండా కాపాడేందుకు జీడిమెట్ల పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా “సే యస్ టు స్పోర్ట్స్, నో టు డ్రగ్స్” నినాదంతో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. క్రీడల ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలనే సందేశాన్ని సమాజానికి అందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు, యువకులు ఈ టోర్నమెంట్‌లో పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటుకోవాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్ గడ్డం మల్లేష్ పిలుపునిచ్చారు. క్రీడలు మనిషికి క్రమశిక్షణ, టీమ్ స్ఫూర్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని, డ్రగ్స్‌కు దూరంగా ఉంచుతాయని ఆయన తెలిపారు. ఈ టోర్నమెంట్ జూన్ 25 బుధవారం ఉదయం 9 గంటల నుంచి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో జరుగుతుంది. జీడిమెట్ల పిఎస్ పరిధిలో నివసించే స్థానిక పౌరులు మాత్రమే పాల్గొనేందుకు అర్హులు. నమోదు సమయంలో ఆధార్ కార్డు కాపీ సమర్పించి స్థానిక నివాస ధ్రువీకరణ తప్పనిసరి. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తారు. ఆసక్తి ఉన్నవారు జూన్ 24 సాయంత్రం 6 గంటలలోపు గూగుల్ ఫారం ద్వారా నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ లింక్ త్వరలో విడుదల చేస్తారు. మరిన్ని వివరాలకు దశరథ్ 9032324504 నెంబర్‌లో సంప్రదించవచ్చు. జూన్ 26 అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం నేపథ్యంలో యువతలో చైతన్యం తీసుకురావడం, పోలీసులు ప్రజలు కలిసి డ్రగ్ ఫ్రీ జీడిమెట్లను నిర్మించుకోవడం, క్రీడా సంస్కృతి పెంపు, స్థానిక ప్రతిభ వెలికితీత ఈ టోర్నీ ప్రధాన లక్ష్యాలు. క్రీడించండి, ప్రోత్సహించండి, డ్రగ్ ఫ్రీ సమాజానికి మీ వంతు సహకారం అందించండి అని ఎస్‌హెచ్‌వో గడ్డం మల్లేష్ విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.