A place where you need to follow for what happening in world cup

- Advertisement -

గిరిజన విద్యార్ధికి దక్కిన గౌరవ పి.హెచ్.డి డాక్టరేట్

0 162

పాల్వంచ: విశాలభారతి: పాల్వంచ మండలం, కొత్త సూరారం గ్రామానికి చెందిన గుగులోత్.రాంజీ-కౌసల్య దంపతుల చిన్న కుమారడు అయిన గుగులోత్.సుధాకర్ మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఇండోర్ లోని ప్రతిష్టత్మకమైన మల్వంచల్ విశ్వవిద్యాలయం నుండి మెడికల్ బయోకెమిస్ట్రీ లోని అత్యంత క్లిష్ట తరమైన “ సర్క్యులిమ్గ్ మైక్రో ఆర్.యన్.ఎ యాజ్ నోవెల్ బయోమర్క్స్ ఆఫ్ మినిరల్ బోన్ డిజర్దర్ అండ్ వాస్క్యులార్ క్లారిఫికేషన్ ఇన్ పేషంట్ విత్ క్రానిక్ కిడ్ని డిసిజేస్” అనే అంశముపై చేసిన పరిశోదనకు గాను గౌరవ పి.హెచ్.డి డాక్టరేట్ ప్రధానం చేయడం జరిగింది. అదేవిధముగా జిపమార్ విశ్వవిద్యాలయం పాండిచ్చేరి నుండి మెడికల్ బయోకెమిస్ట్రీ నందు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొందడం జరిగింది. ప్రస్తుతం గుగులోత్.సుధాకర్ ప్రభుత్వ వైద్య కళాశాల, పాల్వంచ యందు మెడికల్ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ నందు లెక్షరర్ గా పనిచేయుచున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా అన్నయ్య గుగులోత్.రాందాస్ ఆశయాలకు అనుగుణంగా నేను ఈ రోజు ఈ స్థాయికి రావడం జరిగింది అని విశాలభారతికి వివరణ ఇవ్వడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.