భద్రాద్రి ప్రతినిధి:విశాలభారతి: గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు క్రీడా పోటీలు నిర్వహించి ప్రతి విద్యార్థిలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యవంతమైన జీవనశైలిని పెంపొందించాలనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి దూరదృష్టి గల ఆలోచనకు సీఎం కప్ 2025–26 ప్రతిరూపం అని స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీ వాకిడి శ్రీహరిస్పష్టం చేశారు. బుధవారం మణుగూరు మండలంలోని జూనియర్ గవర్నమెంట్ కాలేజ్ ప్రాంగణంలో సీఎం కప్ 2025–26 కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ క్రీడ జ్యోతిని వెలిగించిన అనంతరం మినిస్టర్ మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రతి క్రీడాకారుడిని రాష్ట్రస్థాయి వేదిక వరకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యం. సీఎం కప్ ద్వారా క్రీడలను జీవితంగా మార్చుకునే అవకాశాన్ని యువతకు అందిస్తున్నా అని ఘనంగా తెలిపారు.
పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పినపాక నియోజకవర్గంలో ఒక్క ప్రతిభ కూడా వృథా కాకూడదు.ప్రతి గ్రామంలో యువత క్రీడల్లో ముందుకు రావాలి. సీఎం కప్ ద్వారా క్రమశిక్షణతో కూడిన బలమైన భవిష్యత్తు నిర్మాణం జరుగుతుందని శక్తివంతంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి.పటేల్ ,భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు,పాల్గొని కార్యక్రమాన్ని పరిశీలించారు.
జూనియర్ గవర్నమెంట్ కాలేజ్ లో విద్యార్థులతో కలిసి నిర్వహించిన భారీ ర్యాలీ సీఎం కప్‌కు ప్రజల నుంచి లభించిన విశేష స్పందనకు నిదర్శనంగా నిలిచింది .ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో నరేష్, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంపీ ఓ వెంకటేశ్వర్లు,మండల అధ్యక్షుడు నవీన్, టౌన్ అధ్యక్షులు శివ సైదులు, మండల మహిళా అధ్యక్షురాలు సౌజన్య, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి, సమితి సింగారం సర్పంచ్ మాధవరావు, శివాలయం చైర్మన్ కూచిపూడి బాబు, మైనార్టీ అధ్యక్షులు రహీం భాష, కూనవరం సర్పంచ్ ఎనిక సరిత,లంక మల్లారం సర్పంచ్ పూణెం రమేష్,కట్టు మల్లారం సర్పంచ్ జగడి ప్రసాద్,గుట్ట మల్లారం సర్పంచ్ కారం పూజిత, తోగూడెం సర్పంచ్ మడకం కృష్ణ,విప్పల సింగారం సర్పంచ్ పాల్వంచ రాములు,మండల ముఖ్య నాయకులు,ఉపాధ్యాయులు విద్యార్థులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
