రేషన్ బియ్యం అక్రమ రవాణాకు బ్రేక్
– గచ్చిబౌలిలో 24 టన్నుల ధాన్యం స్వాధీనం
– ఐదుగురు పట్టివేత
సైబరాబాద్ – విశాల భారతి
గచ్చిబౌలిలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను సివిల్ సప్లై అధికారులు, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా భగ్నం చేశారు. గౌలిదొడ్డి గురుకుల పాఠశాల సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 22 టన్నుల రేషన్ బియ్యం, 2 టన్నుల గోధుమలను స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఒక లారీ, నాలుగు టాటా ఏస్ వాహనాలను సీజ్ చేసి, ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
