A place where you need to follow for what happening in world cup

- Advertisement -

ఓటరు నమోదుకు ఎస్‌ఐఆర్ కీలకం – డీసీ చాముండేశ్వరి  

0 75

ఓటరు నమోదుకు ఎస్‌ఐఆర్ కీలకం – డీసీ చాముండేశ్వరి
– హెచ్‌ఎంటీ, సెవెన్ హిల్స్‌లో క్షేత్రస్థాయి పరిశీలన

సైబరాబాద్ – విశాల భారతి
భాగ్యనగర్ డివిజన్ పరిధిలోని హెచ్‌ఎంటీ శాతవాహన నగర్, సెవెన్ హిల్స్ ప్రాంతాల్లో బుధవారం ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఆల్విన్ కాలనీ సర్కిల్ 51 డీసీ చాముండేశ్వరి బీఎల్‌ఓ, బీఎల్‌ఏలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు.సెవెన్‌హిల్స్ బాగ్యనగర్ వార్డులో ఇంటింటికీ వెళ్లి ఎస్‌ఐఆర్ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటరు నమోదు, సవరణల కోసం ఫారాలను పంపిణీ చేసి, సక్రమంగా పూరించే విధానాన్ని తెలిపారు. ప్రతి ఓటరు వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని, డోర్ మార్కింగ్ పక్కాగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు. 18 ఏళ్లు నిండిన యువతను తప్పనిసరిగా జాబితాలో చేర్చాలని, మరణించిన, డబుల్ ఎంట్రీ ఓటర్లను తొలగించాలని ఆదేశించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా పని చేయాలని బీఎల్‌ఓ, బీఎల్‌ఏలకు స్పష్టం చేశారు. ప్రజలు ఆధార్, రేషన్ కార్డు వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకొని సిబ్బందికి సహకరించాలని కోరారు. కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు కూడా ఎస్‌ఐఆర్‌లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.