విశాలభారతి: రాష్ట్ర డీజీపీగా శివధర్‌రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త ధన్‌గోపాల్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ జరిపారు. సెప్టెంబర్ 2025న ప్రభుత్వం జారీచేసిన డీజీపీ నియామక ఉత్తర్వులు 2018లో సుప్రీంకోర్టు జారీ చేసిన గైడ్‌లైన్స్‌కు వ్యతిరేకమని పిటిషనర్ వాదించారు. తాత్కాలిక ప్రాతిపదికన డీజీపీని నియమించరాదని ప్రకాశ్‌సింగ్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చిందని గుర్తుచేశారు. డీజీపీ నియామకం కోసం ఎంపిక చేసిన ప్యానల్ ఒకరిని సూచించాలని, వారి నియామకం శాశ్వతమైనదిగా ఉండేలా చూడాలని చెప్పారు. డీజీపీ పదవీ విరమణకు మూడు నెలల ముందుగానే యూపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పోస్టు భర్తీ వివరాలు సమర్పించాలని చెప్పారు. అర్హులైన ఐపీఎస్ అధికారుల జాబితాను యూపీఎస్సీకి పంపడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు.
సామాజిక కార్యకర్త ధన్‌గోపాల్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ జరిపారు. సెప్టెంబర్ 2025న ప్రభుత్వం జారీచేసిన డీజీపీ నియామక ఉత్తర్వులు 2018లో సుప్రీంకోర్టు జారీ చేసిన గైడ్‌లైన్స్‌కు వ్యతిరేకమని పిటిషనర్ వాదించారు. తాతాలిక ప్రాతిపదికన డీజీపీని నియమించరాదని ప్రకాశ్‌సింగ్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చిందని గుర్తుచేశారు. డీజీపీ నియామకం కోసం ఎంపిక చేసిన ప్యానల్ ఒకరిని సూచించాలని, వారి నియామకం శాశ్వతమైనదిగా ఉండేలా చూడాలని చెప్పారు. డీజీపీ పదవీ విరమణకు మూడు నెలల ముందుగానే యూపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పోస్టు భర్తీ వివరాలు సమర్పించాలని చెప్పారు. అర్హులైన ఐపీఎస్ అధికారుల జాబితాను యూపీఎస్సీకి పంపడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. దీనిపై అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి ప్రతివాదన చేస్తూ.. యూపీఎస్సీకి జాబితా పంపామని, ఈ లోగా కొందరు అధికారుల పదవీ విరమణతో ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారిందని వివరించారు. సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించారని భావిస్తే సర్వోన్నత న్యాయస్థానంలోనే ధికార పిటిషన్ వేయాలని సూచించారు. ఈ కేసులో వివరాలు అందజేసేందుకు గడువు కావాలని కోరడంతో అందుకు హైకోర్టు అనుమతిచ్చింది.
