A place where you need to follow for what happening in world cup

- Advertisement -

42 కిలోల గంజాయి స్వాధీనం

42 కిలోల గంజాయి

0 214

పాల్వంచ, విశాలభారతి: పత్రికా మిత్రులకు తెలియజేయునది ఏమనగా, నిన్న సాయంత్రం సుమారు 06:30 గంటల సమయంలో పాల్వంచ బస్టాండ్‌లో చేతిలో బ్యాగులు పట్టుకుని ఉన్న ఐదుగురు అనుమానితులను సోదా చేయగా వారి వద్ద సుమారు 42 కిలోల గంజాయి లభించింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, వీరందరూ చెన్నై నుండి భద్రాచలం చేరుకుని అక్కడ శ్రీను అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేశారని తేలింది. అనంతరం వారు పాల్వంచ మీదుగా జంగారెడ్డిగూడెం వెళ్ళే బస్సు కోసం వేచి చూస్తుండగా పాల్వంచ పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితులు భద్రాచలంలో తక్కువ ధరకు గంజాయిని కొని, చెన్నైలోని నరేందర్ అనే వ్యక్తికి ఎక్కువ ధరకు విక్రయిస్తుంటారని విచారణలో వెల్లడైంది. వారి నుండి 42 కిలోల గంజాయితో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో పట్టుబడిన నిందితులలో తమిళనాడుకు చెందిన 57 ఏళ్ళ ఝాన్సీ అయ్యప్పన్, 35 ఏళ్ళ ధనలక్ష్మి సురేష్, 64 ఏళ్ళ వనిత గణేష్, 60 ఏళ్ళ వలియమ్మ శన్ముగంమ్,  24 ఏళ్ళ డ్రైవర్ శ్రీనివాసన్ మనికండన్ ఉన్నారు. కాగా, ఈ ముఠాకు ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న చెన్నైకి చెందిన నరేందర్,  విజయవాడకు చెందిన శ్రీను ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.