A place where you need to follow for what happening in world cup

- Advertisement -

ఎస్‌ఐఆర్‌పై అవగాహన.. పత్రాల పంపిణీ

0 47

ఎస్‌ఐఆర్‌పై అవగాహన.. పత్రాల పంపిణీ
– హైదర్‌నగర్‌లో డీసీ చాముండేశ్వరి పర్యటన
– బీఎల్ఓలు, స్థానిక నేతల భాగస్వామ్యం

హైదర్‌నగర్ – విశాల భారతి
హైదర్‌నగర్‌లో ఎస్‌ఐఆర్‌పై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. డీసీ చాముండేశ్వరి స్వయంగా పర్యటించి ఎస్‌ఐఆర్ పత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బీఎల్ఓలు జ్యోతి, పర్వీన్‌తో పాటు స్థానిక నేతలు యాసిన్, సలీం తదితరులు పాల్గొన్నారు. ఎస్‌ఐఆర్ ఆవశ్యకత, లబ్ధిదారుల ఎంపిక, దరఖాస్తు విధానంపై ప్రజలకు వివరించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఎస్‌ఐఆర్‌కు దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని డీసీ చాముండేశ్వరి సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పత్రాల పంపిణీ తీరును పరిశీలించారు. ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.