సమన్వయం లేక రోడ్డెక్కిన చెత్త
– కరెంట్ కొమ్మలు నరికారు.. వదిలేశారు
– హాఫీజ్‌పేట్‌లో అధికారుల నిర్లక్ష్యం
శేరిలింగంపల్లి – విశాల భారతి
కరెంట్ తీగలకు అడ్డు తొలగించారు, కానీ రోడ్డుకు అడ్డు మిగిల్చారు. విద్యుత్ శాఖ కొమ్మలు నరికి వదిలేయడంతో హుడా కెఫే నుంచి గంగారం వరకు గ్రీన్ వేస్ట్ కుప్పలుగా పేరుకుపోయింది.తరలింపుపై విద్యుత్ శాఖ, జీహెచ్‌ఎంసీ మధ్య సమన్వయం కరువైంది. రహదారి కుంచించుకుపోయి వాహనాలు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. “వర్షం వస్తే నాలాలు మూసుకుపోతాయి” అని స్థానికుల ఆగ్రహం.
*ఏఈ దాటవేత:* దీనిపై తారానగర్ విద్యుత్ ఏఈని వివరణ కోరగా.. “అది మా పరిధిలోని అంశం కాదు. కొమ్మలు నరికిన తర్వాత మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చాం. తరలింపు వారి పని” అని దాటవేశారు.
