A place where you need to follow for what happening in world cup

- Advertisement -

రోడ్డును మూసేసిన నిర్మాణదారుడు 

0 35

రోడ్డును మూసేసిన నిర్మాణదారుడు
– ఇనుప కడ్డీలతో దారి బంద్
–  ఎస్ రాజు నగర్ లో ప్రజల అవస్థలు

హైదర్‌నగర్ – విశాల భారతి
ఆల్విన్ కాలనీ సర్కిల్-51 పరిధిలోని హైదర్‌నగర్ డివిజన్ ఏఎస్ రాజు నగర్‌లో ఓ నిర్మాణ దారుడి ఆగడాలు మితిమీరాయి. భవన నిర్మాణం పేరుతో రోడ్డును పూర్తిగా ఆక్రమించి సిమెంటు, ఇసుక, కంకరను రోడ్డుపైనే డంప్ చేశాడు.అంతటితో ఆగకుండా ఇటువైపు నుంచి అటు దారి వెళ్లకుండా ఇనుప కడ్డీలను అడ్డంగా పెట్టి రాకపోకలను పూర్తిగా స్తంభింపజేశాడు. దీంతో వాహనాలు, పాదచారులు వెళ్లేందుకు వీల్లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సేవలు కూడా నిలిచిపోయే పరిస్థితి.నిబంధనల ప్రకారం రోడ్లపై నిర్మాణ సామగ్రి వేయడం నేరం. రూ.25 వేల వరకు జరిమానా విధించవచ్చు. రోడ్డును బ్లాక్ చేసిన సదరు యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.