A place where you need to follow for what happening in world cup

- Advertisement -

బాల్య వివాహాలు వద్దు పిల్లలకు ఉన్నత చదువులే ముద్దు

0 200

భద్రాద్రి జిల్లా: విశాలభరతి: లక్ష్మీ దేవిపల్లి మండలం లోతువాగు పంచాయతీ పడిగా గుంపు నందు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ ఆదేశాల మేరకు బాల్య వివాహాలు పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది ఈసందర్భంగా జిల్లా పారా లీగల్ వలేంటర్ ముత్తవరపు జానకిరామ్ మాట్లాడుతూ బాల్య వివాహాలు అరికట్టేందుకు ప్రతివక్కరు కృషి చేయాలని అది ప్రతి వక్కరి బాధ్యత అని గ్రామస్తుల చేత ప్రతిజ్ఞ చేయించారు బాల్య వివాహాలు చేసే తల్లిదండ్రుల పై చట్టపరమైన చర్యలు ఉంటాయి అని తల్లిదండ్రులు గమనించాలి అనితెలియజేశారు.బాల్య వివాహాలు వద్దు ఉన్నత చదువులే ముద్దు అనే నినాదం తెలుపుతూ బాల్య వివాహాలు చేసే వారిపైన టూల్ ఫ్రీ నెంబర్ 1098 ఫోన్ చేసి పిర్యాదు చేయగలరని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు బాల్య వివాహాల అరికట్టాలని కోరారు.చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 గురించి తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలి అని ఈ సందర్భంగా తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో పడిగా ఎంకన్న, పడిగా శారదా, కోరం వసంత, కోరం భావని, పడిగా సరిత, పడిగా లక్ష్మీ ప్రసన్న, పడిగా అరవింద్, మెట్ల చిన్నారి,తాటి వెంకటమ్మా, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.