A place where you need to follow for what happening in world cup

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు: మంత్రి సీతక్క

0 216

ములుగు జిల్లా: విశాలభారతి: ములుగు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క ములుగు క్యాంపు కార్యాలయం నుండి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ప్రైస్ ద లార్డ్ అంటూ.. క్రిస్మస్ శాంతి సందేశాన్నిచ్చారు. మంత్రి శీతక్క మాట్లాడుతూ  ప్రభువైన ఏసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం పాపుల రక్షకుడిగా నరుడి రూపంలో  పరలోకమందున్న యెహోవా మరియు నరులకు మధ్య వారధిగా మరియమ్మ గర్భమునందు జన్మించారన్నారు. లోక రక్షకుడిగా జన్మించిన ఆయన తన బాల్య దశ నుండి 33 1/2 సంవత్సరాలు అనగా దాదాపు 34 సంవత్సరాలు(తన చివరి శ్వాస వరకు)  ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇస్తూ ప్రేమను పంచారన్నారు. ఆయన  బైబిల్ లో  ఉన్న  10 ఆజ్ఞలను ప్రచారం చేస్తూ మహోన్నతుడైన యెహోవా నామములో అనేక అద్భుతాలు చేసి,పాపుల రక్షకుడుగా గుర్తింపు పొందిన విషయాన్ని  పవిత్ర బైబిల్ గ్రంథం  తెలియపరుస్తుందని గుర్తు చేశారు.ఏసుక్రీస్తు మరియు ఆయన జీవనశైలిని మన జీవితాల్లో అనువదించుకొని చెడును  విసర్జించి, పాపపు అలవాట్లను పారద్రోలుతూ.శాంతి, ప్రేమ, కరుణ, జాలి, దయను తోటి వారికి పంచినప్పుడే ఐక్యత మరియు ప్రేమ భావంతో మెలగగలమని  మంత్రి సీతక్క గారు తన క్రిస్మస్ సందేశంలో పేర్కొన్నారు.మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.