A place where you need to follow for what happening in world cup

- Advertisement -

మదీనాగూడలో బోర్‌వెల్ కార్మికుడు అదృశ్యం

0 115

మదీనాగూడలో బోర్‌వెల్ కార్మికుడు అదృశ్యం
– బాత్‌రూంకు వెళ్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి
– ఛత్తీస్‌గఢ్‌కు చెందిన జీత్ రూ రామ్ కశ్యప్‌గా గుర్తింపు
– కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మియాపూర్ పోలీసులు

సైబరాబాద్ – విశాల భారతి
ఉపాధి కోసం ఛత్తీస్‌గఢ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ బోర్‌వెల్ కార్మికుడు అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. బాత్‌రూంకు వెళ్తానని తోటి పనిచేసే వ్యక్తికి చెప్పి వెళ్లి, తిరిగి రాని ఘటన మదీనాగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని అవంతి ఎన్‌క్లేవ్‌లో వెలుగు చూసింది.
సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి..
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన జీత్ రూ రామ్ కశ్యప్ (57) బోర్‌వెల్ పనుల నిమిత్తం నగరానికి వచ్చాడు. ఈ నెల 17న మదీనాగూడలోని అవంతి ఎన్‌క్లేవ్‌లో డ్రిల్లింగ్ పనులకు వెళ్లాడు. ఉదయం 10 గంటల ప్రాంతంలో బాత్‌రూంకు వెళ్లి వస్తానని చెప్పి పక్కకు వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి కార్మికులు, యజమాని చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు.అన్ని చోట్లా వెతికినా అతని ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన చెందిన యజమాని వెంటనే మియాపూర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ కశ్యప్ ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.