A place where you need to follow for what happening in world cup

- Advertisement -

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చందానగర్ పోలీసులు

0 365

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చందానగర్ పోలీసులు
– భూ సెటిల్‌మెంట్‌ విషయంలో బాధితుడి వద్ద డబ్బు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు

సైబరాబాద్ – విశాల భారతి
భూ సెటిల్‌మెంట్‌ విషయంలో ఓ వ్యక్తి వద్ద లంచం డిమాండ్‌ చేసిన ఆరోపణలపై చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన అడ్మిన్‌ ఎస్‌ఐ బాలరాజుతో పాటు కానిస్టేబుళ్లు రాఘవ, రాజ్‌కుమార్‌ ఏసీబీకి పట్టుబడినట్లు సమాచారం.శనివారం జరిగిన ఈ ఘటన చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కలకలం రేపింది.భూ వివాదానికి సంబంధించి ఓ బాధితుడి నుంచి పోలీసులు డబ్బు డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు సమాచారం. ముందస్తు ప్రణాళికలో భాగంగా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి, లంచం తీసుకుంటున్న సమయంలో ఎస్‌ఐ బాలరాజుతో పాటు కానిస్టేబుళ్లు రాఘవ, రాజ్‌కుమార్‌ను పట్టుకున్నట్లు తెలిసింది.పోలీసు అధికారులు భూ వివాదాలను పరిష్కరించే పేరుతో డబ్బులు డిమాండ్‌ చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం.పట్టుబడిన వారిని విచారించడంతో పాటు లంచం డిమాండ్‌కు సంబంధించిన వ్యవహారంపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.