శేరిలింగంపల్లి, విశాలభారతి: నిబంధనలు తుంగలో తొక్కుతూ జీహెచ్ఎంసీ సర్కిల్ 21 పరిధిలో ఇష్టారాజ్యాంగ కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. కానీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరికొందరు అధికారుల దృష్టికి రాకుండా కింది స్థాయి సిబ్బంది కొంత మంది నాయకుల అండతో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్ని నిర్మాణాలపై వారికి ఫిర్యాదులు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. మళ్లీ అటువైపు చూడడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు గండి పడుతుంది. సరైన పద్ధతిలో ప్రభుత్వానికి రుసుముల చెల్లించి అనుమతులు పొంది తర్వాత చేపట్టాల్సిన నిర్మాణాలు కొందరు ముందుగానే పెద్ద ఎత్తున భారీ నిర్మాణాలు చేపడుతున్నారు.మరికొందరు జీ+2 అనుమతులు పొంది 4, 5, 6 అంత స్తులను నిర్మిస్తున్నారు.కొందరు కిందిస్థాయి అధికారులు కాసులకు కక్కుర్తి పడి నిబంధనలను బేఖాతర్ చేస్తున్నారు.నిర్మాణాలు అధికారుల సమస్వయంతోనే జరుగుతున్నాయని ఆరో పణలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ శాఖ ఉన్నత స్థాయి అధికారులు దృష్టి సారించి అనుమ తులు పొందకుండా అక్రమ నిర్మా ణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రా యాలు వ్యక్తం చేస్తున్నారు.
మైత్రి నగర్ లో అక్రమ నిర్మాణం
జీహెచ్ఎంసీ,చందానగర్ సర్కిల్ 21 పరిధిలోని మైత్రి నగర్ లో అక్రమ నిర్మాణం చేపట్టారు.జి +3 కి అనుమతి పొంది దానిపై 2 అంతస్థులు అదనంగా అనుమతులు లేకుండా నిర్మిస్తున్న దీనిపై అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
మదీనా గూడలో..
జీహెచ్ఎంసీ,చందానగర్ సర్కిల్ 21 మదీనాగూడ కృష్ణ టెంపుల్ లైన్ లో కాలనీ ఓవర్ లాపింగ్ లో సెట్ బ్యాక్ కోసం కేటాయించిన స్థలంలో తప్పుడు పత్రాలు సృటించి అక్రమ నిర్మాణం చేపడుతున్నట్లు ప్రజావాణిలో స్టానికులు ఫిర్యాదు చేసిన చెత్త బుట్టల పాలేనని విమర్శిస్తున్నారు. ఐనా ఇవేమి అధికారుల కంటపడడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు.అధికారులు చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఆల్విన్ చౌరస్తాలో..
మియాపూర్ ఆల్విన్ చౌరస్తా సమీపంలో షెడ్డుతో కూడుకున్న అక్రమ నిర్మాణం జరుగుతున్నది.సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే సీఎంవో కార్యాలయం నుంచి మాకు ఒత్తిడి ఉందని దాటవేస్తున్నారు. ఇలా ప్రతి నిర్మాణం వెనుక ఆయా శాఖ, లేదా సంభందించిన అధికారులను పేర్లతో అక్రమ నిర్మాణాలపై నిర్లక్ష్య ధోరణి చూపిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.
ప్రజావాణి ఫిర్యాదులు బట్టాదాఖలు
మదీనాగూడ,స్థానికుడు, బాబు మోహన్ మల్లేష్.
ప్రజా సమస్యల కోసం ప్రజలకు నేరుగా వారి సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటుచేసిన ప్రజావాణి కార్యక్రమం అబసుపాలవుతోంది.గత సోమవారం మదినగూడలో అనుమతులకు విరుద్ధంగా కమర్షియల్ భావన నిర్మాణంపై ఫిర్యాదు చేస్తే డీసీ శశిరేఖ చర్యలు తీసుకుంటామని ఇప్పటివరకు తీసుకోలేదు. ప్రజావాణి పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లి ఫిర్యాదు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.
