రోడ్డుపై నిర్మాణ వ్యర్థాలు.. రూ.5 వేల ఫైన్
– ఆక్రమణలపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం
– వ్యర్థాలు తక్షణమే తొలగించాలని ఆదేశం
సైబరాబాద్ – విశాల భారతి
రోడ్లపై అడ్డగోలుగా నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలు వేస్తే చర్యలు తప్పవని జీహెచ్ఎంసీ అధికారులు మరోసారి స్పష్టం చేశారు. సర్కిల్-51 ఆల్విన్ కాలనీ పరిధిలో సోమవారం నిర్వహించిన పారిశుధ్య తనిఖీల్లో రోడ్డును ఆక్రమించి సీ అండ్ డీ వ్యర్థాలు డంప్ చేసిన వ్యక్తిపై కొరడా ఝుళిపించారు.బృందావన్ కాలనీకి చెందిన రామచంద్రారెడ్డి రోడ్డుపై ఇటుకలు, కాంక్రీట్ ముక్కలు, పెచ్చులు లాంటి నిర్మాణ వ్యర్థాలు వేసినట్లు గుర్తించారు. దీంతో ఆయనపై రూ.5 వేల జరిమానా విధించి వసూలు చేశారు. ప్రజా రవాణాకు, పాదచారులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్న వ్యర్థాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఏఈ ఎస్‌డబ్ల్యూఎం, ఎస్‌ఆర్‌పీ, ఎస్‌ఎఫ్‌ఏల సమక్షంలో మధ్యాహ్నంలోగా రోడ్డును పూర్తిగా క్లియర్ చేయాలని సూచించారు.
