రాయదుర్గం భూమి వ్యవహారంపై దాసోజు శ్రవణ్ ఆరోపణలు
సైబరాబాద్ – విశాల భారతి
రాయదుర్గంలో పీఎం ఏక్తా మాల్ నిర్మాణం పేరుతో సుమారు రూ.1,700 కోట్ల విలువైన ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని బినామీ సంస్థలకు అప్పగించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఎలాంటి పారదర్శక టెండర్లు నిర్వహించకుండానే భూమిని కట్టబెట్టారని విమర్శించారు.ఈ వ్యవహారంపై గవర్నర్, సీఐడీ, సీబీఐకి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.200 కోట్ల రుణం ఇచ్చిందని పేర్కొంటూ, భూ కేటాయింపులు, ఒప్పందాలు, టెండర్లపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.రాయదుర్గంలో జరుగుతున్నది భూ దోపిడీ అని, ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు తమ పోరాటం కొనసాగుతుందని దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్రపైనా విచారణ జరపాలని కోరారు. అయితే, ఆయన చేసిన ఆరోపణలపై ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది.
