A place where you need to follow for what happening in world cup

- Advertisement -

డేటింగ్ యాప్ ‘ట్రాప్’: జూబ్లీహిల్స్ పబ్‌లో చిందులు… మాదాపూర్‌లో బాదుడు

0 111

డేటింగ్ యాప్ ‘ట్రాప్’: జూబ్లీహిల్స్ పబ్‌లో చిందులు… మాదాపూర్‌లో బాదుడు
– పబ్ బిల్లు వివాదంతో యువకుడిపై దాడి.. కేసు నమోదు

సైబరాబాద్ – విశాల భారతి
డేటింగ్ యాప్ ద్వారా ఏర్పడిన పరిచయం ఓ యువకుడిపై దాడికి దారి తీసింది. జూబ్లీహిల్స్‌లోని పబ్‌లో యువతితో కలిసి మద్యం సేవించిన యువకుడు, బిల్లు చెల్లింపు విషయంలో జరిగిన వివాదంతో చివరకు మాదాపూర్‌లో దాడికి గురయ్యాడు.ఓయూ కాలనీకి చెందిన యువకుడికి కొంతకాలం క్రితం డేటింగ్ యాప్ ద్వారా ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో కలుసుకుని మద్యం సేవించారు. బిల్లు తానే చెల్లిస్తానని యువతి ముందుగా చెప్పినా, చివరకు యువకుడితోనే మొత్తం డబ్బులు చెల్లింపజేసినట్లు సమాచారం.
పబ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని యువకుడు అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో యువతి తన స్నేహితులను అక్కడికి పిలిపించగా, వారు యువకుడిని మాదాపూర్ మెట్రో స్టేషన్ సమీపానికి తీసుకెళ్లి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.గాయపడిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్న పోలీసులు దాడికి పాల్పడిన వారి కోసం గాలింపు చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.