యువత మేలుకో..హక్కులు సంధించుకో
– నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
– ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
– యువ సంగ్రామ సదస్సుకు భారీ ఎత్తున యువతతో బయలు దేరిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
– 500 వాహనాలలో 3000 వేల మంది యువకులతో భారీ కాన్వాయ్ తో సభకు.
షాద్ నగర్ – విశాల భారతి
ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు నీరుద్యోగులకు, విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చింది.ఎన్నికల్లో విద్యార్థులు, యువకులు తమ కళ్లకు బలపం కట్టుకొని కార్యక్తల కంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ కి పని చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య పాత్ర పోషించారు.కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం యువకులను,విద్యార్థులను మోసం చేసింది.ఉద్యోగ నియామకాలు ఇవకుండా నిరుద్యోగులను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందనీ ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియం లో కేటీఆర్ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 500 వందల వాహనాలలో 3000 వేల మంది నిరుద్యోగ యువకులు భయాలు దేరారు..ఈ సందర్భంగా పట్టంలోని ఈడెన్ ప్లాజా నుండి షాద్ నగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు..అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి..?
ఆనాడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం..ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారని,కానీ ఆ హామీ ఇప్పటి వరకు కూడా అమలు కాలేదని ఆరోపించారు. నిరుద్యోగులకు ఇప్పటి వరకు కూడా కొత్త నోటిఫికేషన్ వేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు..గత బిఆర్ఎస్ ప్రభుత్వం లో వేసిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చారే తప్ప కొత్తగా ఏమి ఇవ్వలేదని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వని దిన స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే వరకు పోరాడతామని అన్నారు.
