A place where you need to follow for what happening in world cup

- Advertisement -

ఎల్లమ్మబండ ఎస్‌సీటీపీలో డీసీ తనిఖీలు

0 70

ఎల్లమ్మబండ ఎస్‌సీటీపీలో డీసీ తనిఖీలు
– డ్రైనేజీ పనులు, పారిశుద్ధ్యంపై ఆరా
– వేగంగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశం

సైబరాబాద్ – విశాల భారతి
కూకట్‌పల్లి జోన్ ఆల్విన్ కాలనీ సర్కిల్-51 పరిధిలోని ఎల్లమ్మబండ ద్వితీయ సేకరణ, రవాణా కేంద్రం (ఎస్‌సీటీపీ) వద్ద శనివారం డీసీ చాముండేశ్వరి పారిశుద్ధ్య తనిఖీలు నిర్వహించారు. డీఈ (ఎస్‌డబ్ల్యూఎం), ఎస్ఆర్పీ, వర్క్ ఇన్‌స్పెక్టర్‌తో కలిసి కేంద్రం వద్ద జరుగుతున్న మురుగు కాల్వ పనులను, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. ఎస్‌సీటీపీ పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా చూడాలని, డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రతిరోజూ పరిశుభ్రత పాటించాలని, వ్యర్థాల రవాణాలో జాప్యం చేయొద్దని ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.