A place where you need to follow for what happening in world cup

- Advertisement -

పాల్వంచ జోరుగా అక్రమ ఇసుక దందా

0 156

Vishlabharathi: భద్రాద్రికోతగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని ముర్రేడువగు నుండి జోరుగా ఇసుక దందా జరుగుతుంది. రాత్రి పగలు తేడాలేకుండా ఇసుకాసురులు వాగులో వున్న ఇసుకను మొత్తం తోడేస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. అక్రమ ఇసుక రవాణాతో ప్రభుత్వ ఆదాయానికి బారి గండిపడుతుంది.పాల్వంచ పారిశ్రామిక ప్రాంతం కావడంతో.ఇక్కడ నిత్యం నిర్మాణాలు జరుగుతుంటాయి.ఇదే అదునుగా చూసుకొని ఇసుకా సురులు రెచ్చిపోయి అక్రమసంపాదనకు తెగబడ్డారు. అడ్డుకున్న సంబందిత శాఖల అధికారులను సైతం డబ్బులు ఎరగా వేసి అక్రమ ఇసుక వ్యాపారాన్ని యదేచ్చగా కొనసాగిస్తున్నారని ప్రచారం జోరుగా జరుగుతుంది.

ర్యాస్ డ్రైవింగ్ తో బెంబేలెత్తుతున్న ప్రజల
శ్రీనివాసకాలని,పాతపాల్వంచ ముర్రేడువగులోనిఇసుకను అమాంతం తోడి అక్రమ సంపాదనకు తెగబడ్డారు. ట్రాక్టర్ డ్రైవర్లు ర్యాస్ డ్రైవింగ్ చేస్తూ ప్రజలను బెంబేలెతేస్తున్నారు.గల్లిల్లో కూడా ర్యాస్ డ్రైవింగ్ చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.అతివేగం ప్రమాదకరమని తెలిసినప్పటికీ. ఇసుక సురుల తీరులో ఎలాంటి మార్పు రావడం లేదు.మేమింతే మాకు అడ్డు అదుపు లేదు ఎంతమంది అధికారులు కట్టడి చేసిన . మాలో ఎలాంటి మార్పు రాదు అన్నట్టుగా వారి వ్యవహార శైలి ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు.గత మూడు రోజులక్రితం ముర్రేడు వాగునుండి ఇసుక ట్రాక్టర్ ర్యాస్ డ్రైవింగ్ చేస్తూ గుడిపాడు ఊరిలో మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న బండిని తప్పించబోయి ఓ ట్రాక్టర్ బోల్తా పడింది ఆ సంఘటనలో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ ప్రాణాలతో బయట పడ్డారు. అనుకోని ప్రాణ నష్టము జరిగితే,ఆ బాధ్యత ఎవరిది అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ర్యాస్ డ్రైవింగ్ కట్టడి చేయకపోతే భవిష్యత్తులో ఎన్ని ప్రాణాలు పోతాయో తెలియని అయోమయంలో బ్రతుకుతున్నామని,ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు కట్టడి చేసినా ఆగని ఇసుక మాఫియ
అధికారులు ఎంత కట్టడి చేసిన ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అధికారుల కళ్లుగప్పి తమ అక్రమ దందాను నిత్యం కొనసాగిస్తున్నారు. సంబంధిత అన్ని శాఖల అధికారులను సైతం మామూళ్ల మత్తులో దించుతూ.అక్రమంగా ఇసుక రవాణా ఎదేచగా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. వీరి వెనుక రాజకీయ నాయకుల హస్త ఉన్నట్లు సమాచారం. ఎన్నిసార్లు ట్రాక్టర్లు పట్టుకున్నా వీరి తీరులో ఎలాంటి మార్పు రావటం లేదంటూ ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు.ఈ అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసేనాధుడే లేరా అని ప్రజల విమర్శిస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

పర్యావరణ విధ్వంసం తప్పదు అంటున్న నిపుణుల
వాగులో ఇసుకను నిరంతరం తోడడం వలన పర్యావరణం, గ్రామీణ జీవనం, వ్యవసాయం,ముఖ్యంగా భూగర్భజలాలు పడిపోవడం.నీటి చేరిక తగ్గిపో వడంతో,దీని వల్ల భూగర్భజల స్థాయి వేగంగా పడిపోతుంది. గ్రామాల్లో బోర్లు ఎండిపోవడం వంటి సమస్యలు వాటిల్లుతాయి.మరియు వ్యవసాయానికి నష్టం , బోర్లు ఎండిపోయి నీటి కొరత వల్ల పంటల ఉత్పత్తి తగ్గిపోతుంది, రైతులు తీవ్రంగా నష్టపోతారు.వాగు లోతు గోతులు ఏర్పడుట ద్వారా ప్రవాహ మారుతుందని,వరదల తీవ్రత, ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కాలుష్యం మరియు నేల సారం తగ్గిపోవడం వాగు, నదుల్లో కాలుష్యం పెరగడం వలన భూమి సారాన్ని తగ్గిస్తుంది.అత్యధికంగా ఇసుకను తరలించే అక్రమ దందా స్థానిక ప్రజలకు, ప్రభుత్వ ఆదాయానికి బారి నష్టం కలిగిస్తుంది.ఇసుక తవ్వకాల వల్ల విధ్వంసంలు ఏర్పడతాయి తద్వారా ప్రజలకు ఆర్థిక నష్టం కలుగుతుంది.నిరంతరంగా పట్టుబడే అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వ చర్యలు, ప్రజాభిప్రాయం ద్వారా నియంత్రణ,ఇసుకకు ప్రత్యామ్నాయ వనరులు ప్రయోగించడం, పర్యావరణ పునరుద్ధరణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.వాస్తవంగా, వాగుల్లో ఇసుకను తోడడాన్ని నియంత్రించకపోతే భవిష్యత్తులో పర్యావరణం విధ్వంసం కలిగి ముర్రేడు వాగు పరిహకప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుందని. నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇసుక రీచ్ లను ఏర్పాటు చేయాల
పాల్వంచ పారిశ్రామికంగా దినదినాభివృది చెందుతున్న  తరుణంలో నిత్యం నిర్మాణాలు జరుగుతుంటాయి. పాల్వంచ. మండలంలో ఇసుక ర్యాంపు ఏర్పాటు చేసి ఇక్కడి ప్రజలకు ఇసుక అందుబాటులోకి తేవాలని సంబంధి అధికారులను,స్థానిక ఎమ్మెల్యేను పట్టణ ప్రజలు కోరినప్పటికీ,నేటికి అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించక వడంతో. శ్రీనివాసకాలని, పాతపాల్వంచ ముర్రేడు వాగు నుడి నిత్యం విచ్చలవిడిగా అక్రమ ఇసుక తోలకాలుజరుగుతున్నాయి.ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

Leave A Reply

Your email address will not be published.