A place where you need to follow for what happening in world cup

- Advertisement -

ఘనంగా కేసిఆర్ జన్మదిన వేడుకలు

0 242

పాల్వంచ, విశాలభారతి: ఈరోజు పాల్వంచ మాజీ మంత్రివర్యులు బిఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్ వనమా వెంకటేశ్వరరావు గారి నివాసం వద్ద బాపు కేసీఆర్ గారి 73వ పుట్టినరోజు ను పురస్కరించుకొని వనమా గారికి చేతుల మీదుగా బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించి ర్యాలీ నిర్వహించి కెసిఆర్ లాంగ్ లివ్ అనే నినాదాలు చేసి అనంతరం కేక్ కట్ చేసి,మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కెసిఆర్ అని కొనియాడారు .ఆనాడు తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ఉద్యమాన్ని ఉవ్వెత్తుతున్న ఉద్రేకం చేసిన వ్యక్తి కెసిఆర్ అని అన్నారు.పదేళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన అభివృద్ధి ప్రదాత కెసిఆర్ అని అన్నారు.రాబోయే రోజుల్లో కేసీఆర్ తోనే అభివృధి సాధ్యమని.బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే వనమా కుటుంబం యొక్క లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్పొరేటర్లు పట్టణ మండల అధ్యక్షులు మహిళా అధ్యక్షులు వివిధ పదవుల్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొనడం జరిగింది

Leave A Reply

Your email address will not be published.