కేపీహెచ్‌బీ ముత్తూట్ ఫిన్‌కార్ప్‌లో గోల్డ్ లోన్ మోసం
– మాజీ మేనేజర్‌పై కేసు
కూకట్‌పల్లి,విశాల భారతి
నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కస్టమర్ల బంగారాన్నే మాయం చేసిన ఘటన కేపీహెచ్‌బీలో కలకలం రేపింది. ముత్తూట్ ఫిన్‌కార్ప్ మాజీ బ్రాంచ్ మేనేజర్ ప్రియాంక రెడ్డి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్లు ఇప్పిస్తానని ఆశ చూపి, సుమారు 40 మంది కస్టమర్ల నుంచి సేకరించిన రూ.10 కోట్ల విలువైన బంగారాన్ని మరొక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థకు అక్రమంగా బదిలీ చేసినట్లు ఆరోపణలు నమోదయ్యాయి.బాధితులు తమ లోన్లు చెల్లించి బంగారం అడిగిన సమయంలో ఆమె రోజుకో సాకు చెబుతూ కాలయాపన చేసింది. అనుమానం వచ్చిన కస్టమర్లు సంస్థలో ఆరా తీయగా, తమ నగలు లాకర్లలో లేవని తేలడంతో బాధితులంతా ఖంగుతిన్నారు. వెంటనే వారు కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, గోల్డ్ లోన్ పత్రాలు, బ్యాంకింగ్ లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ కుంభకోణంలో మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
