డ్రైనేజీలో నవజాత శిశువు మృతదేహం
* మ్యాన్‌హోల్ శుభ్రం చేస్తుండగా వెలుగులోకి.. పోలీసుల దర్యాప్తు
సైబరాబాద్ – విశాల భారతి
కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో అమానుష ఘటన వెలుగుచూసింది. లోటస్ ఆస్పత్రి సమీపంలోని డ్రైనేజీలో నవజాత శిశువు మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. కొద్దిరోజులుగా డ్రైనేజీ బ్లాక్ కావడంతో స్థానికులు మున్సిపల్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. డ్రైనేజీని శుభ్రం చేసేందుకు సిబ్బంది మ్యాన్‌హోల్‌ను తెరిచి పరిశీలిస్తుండగా శిశువు మృతదేహం కనిపించింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.నవజాత శిశువు మృతదేహం డ్రైనేజీలోకి ఎలా వచ్చింది? ఎవరైనా కావాలనే పడవేశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీప ప్రాంతాల్లోని వివరాలను సేకరిస్తూ ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నారు.
