A place where you need to follow for what happening in world cup

- Advertisement -

మహిళల గౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది

0 50

మహిళల గౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది
* వెయ్యి రోజుల పాలనపై శేరిలింగంపల్లిలో మహిళల నిరసన
* సింధం శ్రీకాంత్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ

హైదర్ నగర్ – విశాల భారతి
మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవం లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళలు నిరసన చేపట్టారు. సింధం శ్రీకాంత్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో హైదర్‌నగర్‌ రామ్‌నరేశ్‌నగర్‌ కాలనీలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించారు. అనంతరం హైదర్‌నగర్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును మాధవరం రోజాదేవి, సింధం శ్రీకాంత్‌ యాదవ్‌ తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్‌రెడ్డి మహిళా ప్రభుత్వమని చెప్పుకోవడం తప్ప.. మహిళలకు రాష్ట్రంలో సరైన గౌరవం దక్కడం లేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రతి ఒక్కరి హక్కని, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని పోలీసుల ద్వారా అణచివేయాలని చూడటం సరికాదన్నారు. వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.