మైత్రినగర్‌లో మౌలిక వసతులపై సమీక్షమైత్రినగర్‌లో మౌలిక వసతులపై సమీక్ష
– ‘వన్ డే.. వన్ వార్డు’లో ప్రజా సమస్యల పరిశీలన
సైబరాబాద్ – విశాల భారతి
‘వన్ డే.. వన్ వార్డు’ కార్యక్రమంలో భాగంగా మైత్రినగర్ ఫేజ్, మాదినగూడ డివిజన్ (వార్డు నం.237), హఫీజ్‌పేట్ డివిజన్ (వార్డు నం.236)లో మంగళవారం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పౌర సమస్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులు తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.సిఎంసి కమిషనర్ శ్రీజన, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్‌తో పాటు ఇంజినీరింగ్, ఘన వ్యర్థాల నిర్వహణ, టౌన్‌ప్లానింగ్, పట్టణ జీవవైవిధ్య విభాగం, ఆహార భద్రత తదితర శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానికులు ప్రస్తావించిన సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, పౌర మౌలిక వసతులను మెరుగుపరిచేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
