A place where you need to follow for what happening in world cup

- Advertisement -

మాదాపూర్‌లో ఎండీఎంఏ కలకలం

0 93

మాదాపూర్‌లో ఎండీఎంఏ కలకలం
– 7.02 గ్రాముల డ్రగ్‌ స్వాధీనం.. యువకుడి అరెస్ట్‌
– ప్రధాన సప్లయర్‌ కోసం పోలీసుల గాలింపు

సైబరాబాద్ – విశాల భారతి
మాదాపూర్‌లో ఎండీఎంఏ విక్రయిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి 7.02 గ్రాముల ఎండీఎంఏ, సెల్‌ఫోన్‌, కాలేజీ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆగస్టు 23న రాత్రి నమ్మదగిన సమాచారం మేరకు షేక్‌ ఆమ్‌ అహ్మద్‌ (23)ను అదుపులోకి తీసుకున్నారు. పంచనామాదారుల సమక్షంలో క్లూస్‌ టీమ్‌ ఫొటోలు, వీడియోలతో తనిఖీ చేయగా అతడి వద్ద ఎండీఎంఏ పట్టుబడింది. ప్రాథమిక విచారణలో ఆమ్‌ అహ్మద్‌.. మహ్మద్‌ ఆమిర్‌ అలియాస్‌ ఆమిర్‌ ఖాన్‌ వద్ద నుంచి ఎండీఎంఏ కొనుగోలు చేసి, ఇతరులకు అధిక ధరకు విక్రయిస్తూ లాభాలు పొందుతున్నట్లు తేలింది. ఈ మేరకు మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితుడిని ఆగస్టు 24న అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎండీఎంఏ సరఫరా చేసిన ప్రధాన నిందితుడు ఆమిర్‌ ఖాన్‌ పరారీలో ఉండటంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.