A place where you need to follow for what happening in world cup

- Advertisement -

విద్యార్థుల సమస్యలపై బంద్‌కు విశేష స్పందన

0 102

విద్యార్థుల సమస్యలపై బంద్‌కు విశేష స్పందన
– పాల్గొన్న విద్యాసంస్థలకు ఏఐఎస్ఎఫ్ అభినందనలు

శేరిలింగంపల్లి,విశాల భారతి
విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన విద్యాసంస్థల బంద్‌కు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మంచి స్పందన లభించిందని ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు టి. నితీష్ ధర్మ తేజ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు తెలుపుతూ సహకరించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.విద్య హక్కు పరిరక్షణ, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం, విద్యార్థులపై పెరుగుతున్న ఆర్థిక భారం తగ్గించడం, విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలనే డిమాండ్లతో ఈ బంద్ చేపట్టినట్లు తెలిపారు. బంద్‌కు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాల ప్రతినిధులు సంఘీభావం తెలపడం ఉద్యమానికి మరింత బలం చేకూర్చిందన్నారు.ప్రజాస్వామ్య పద్ధతిలో బంద్‌ను విజయవంతం చేసిన విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలకు ఏఐఎస్ఎఫ్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.