విశాలభారతి: తిరుమల శ్రీవారికి ఒక భక్తుడు నాలుగున్నర కోట్ల రూపాయల విలువైన విలక్షణ యజ్ఞోపవీతాన్ని సమర్పించడంతెలుగులో విశేష చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌కు చెందిన నిలోఫర్ టీ దుకాణం యజమాని మరియు వైశ్య ప్రముఖుడు నీలాపూర్ బాబూరావు ఈ అత్యంత విలువైన కానుకను భక్తి పరవశంతో శ్రీవారికి సమర్పించారు.
వజ్రాలతో అలంకరించిన ప్రత్యేక యజ్ఞోపవీతం..
ఈ యజ్ఞోపవీతం పూర్తిగా అతి విలువైన వజ్రాలు మరియు బంగారంతో రూపొందించబడింది. నిపుణుల కళాకారులతో ప్రత్యేకంగా తయారు చేయించగా, ఖర్చు సుమారు రూ.4.5 కోట్లు వచ్చినట్లు తెలిసింది. ఇది శ్రీవారి సేవలకు అంకితం చేసేందుకు ప్రత్యేక రీతిలో తయారుచేయబడింది.
భక్తుడు బాబురావు భావోద్వేగ వ్యాఖ్యలు..
యజ్ఞోపవీతం సమర్పించిన అనంతరం బాబురావు భావోద్వేగంతో మాట్లాడుతూ ..గత నెలలో శ్రీవారి దర్శనానికి వచ్చాను. ఆ సమయంలో యజ్ఞోపవీతం తెస్తావా అన్నట్టుగా అనిపించింది. ఆ భావన వెంటాడడంతో నెల రోజుల్లోనే వజ్రాలతో చేయించి తీసుకు వచ్చాను. ఇది నా జీవితంలో పెద్ద అదృష్టం.” అని తెలిపారు. టీటీడీ అధికారులు భక్తుడి సేవాభావాన్ని అభినందించారు. ఈ యజ్ఞోపవీతాన్ని శ్రీవారి సేవలో ప్రత్యేక సందర్భంగా ఆపాదించనున్నట్టు సమాచారం.
