A place where you need to follow for what happening in world cup

- Advertisement -

సీఎంసీ ప్రజావాణికి 48 ఫిర్యాదులు

0 80

సీఎంసీ ప్రజావాణికి 48 ఫిర్యాదులు
– పట్టణ ప్రణాళిక విభాగానికే 41 అర్జీలు
– సకాలంలో పరిష్కరించాలని కమిషనర్‌ శ్రీజన ఆదేశం

సైబరాబాద్ – విశాల భారతి
సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సిఎంసి కమిషనర్‌ శ్రీజన ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 48 అర్జీలు అందగా, పట్టణ ప్రణాళిక విభాగానికి 41, ఇంజినీరింగ్‌కు 5, పరిపాలన, పట్టణ జీవవైవిధ్య విభాగాలకు ఒక్కొక్కటి చొప్పున ఫిర్యాదులు వచ్చాయి.ప్రతి అర్జీని ప్రత్యేక ఫిర్యాదు గుర్తింపు సంఖ్యతో నమోదు చేసి, సమస్య పరిష్కార పురోగతిని తెలుసుకునేందుకు ట్రాకింగ్‌ లింక్‌ అందించారు. ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, నిర్ణీత గడువులోగా అవసరమైన చర్యలు తీసుకుని సకాలంలో పరిష్కరించాలని కమిషనర్‌ శ్రీజన ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.