కాంగ్రెస్ హామీలు ‘నీటిమూటలే’
– సైబరాబాద్ కమిషనర్‌కు బీఆర్ఎస్ వినతి
– ప్రజా సమస్యలు తీర్చకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరిక
సైబరాబాద్ – విశాల భారతి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. సోమవారం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.శ్రీజనకు కలిసి స్థానిక సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
ఎన్నికల హామీలన్నీ ఓట్ల కోసమేనని, అధికారంలోకి వచ్చాక రోడ్ల మరమ్మతులు, వీధిదీపాలు, తాగునీరు, డ్రైనేజీ వంటి కనీస వసతులను కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గుంతలమయమైన రహదారులకు వెంటనే బీటీ, సీసీ పనులు చేపట్టి, వర్షాకాలం దృష్ట్యా మురుగునీటి వ్యవస్థను ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు తక్షణమే పరిష్కరించకపోతే బాధితులతో కలిపి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ వినతిపై స్పందించిన కమిషనర్ శ్రీజన, త్వరలోనే క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొమిరి శెట్టి సాయిబాబా, నవతారెడ్డి, మాధవరం రంగారావు, నాయకులు సంగారెడ్డి, మిద్దెల మల్లారెడ్డి ,రవి యాదవ్,రోజా రమణి, తదితరులు పాల్గొన్నారు.
