శేరిలింగంపల్లిలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
– వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ
శేరిలింగంపల్లి – విశాల భారతి
80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మక్తా మహబూబ్‌పేటలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశ సమైక్యత, సార్వభౌమత్వాన్ని కాపాడుతూ ప్రజాసేవలో ముందుంటామని వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ తెలిపారు.
