A place where you need to follow for what happening in world cup

- Advertisement -

బైక్‌ను ఢీకొట్టిన కారు..బాలుడు దుర్మరణం

0 198

బైక్‌ను ఢీకొట్టిన కారు.. బాలుడు దుర్మరణం
– కుమారుడిని బ్యాడ్మింటన్‌ క్లాస్‌కు తీసుకెళ్తుండగా ఘోర ప్రమాదం

రాజేంద్రనగర్‌ – విశాల భారతి
కుమారుడిని బ్యాడ్మింటన్‌ క్లాస్‌కు తీసుకెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొనడంతో ఓ బాలుడు మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. బండ్లగూడ జాగీర్‌లోని శిశుమందిర్‌ స్కూల్‌ సమీపంలో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.కాళీ మందిర్‌ పీబీఈఎల్‌ సిటీకి చెందిన రమేష్‌రెడ్డి తన ఏడేళ్ల కుమారుడిని బైక్‌పై బ్యాడ్మింటన్‌ క్లాస్‌కు తీసుకెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో రమేష్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 112కు సమాచారం అందించి అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ప్రమాదంలో రమేష్‌రెడ్డి కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం బాలుడిని ఇంటికి పంపించారు. తండ్రిని కోల్పోయిన బాలుడి పరిస్థితి కుటుంబసభ్యులను,స్థానికులను తీవ్రంగా కలచివేసింది.సమాచారం అందుకున్న రాజేంద్రనగర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు, కారు వేగం, డ్రైవర్‌ మద్యం సేవించి వాహనం నడిపాడా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.