ఆల్విన్ కాలనీ సర్కిల్ 51లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
– 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ
సైబరాబాద్ – విశాల భారతి
దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆల్విన్ కాలనీ సర్కిల్–51 కార్యాలయంలో శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాముండేశ్వరి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ సమగ్రత, అభివృద్ధి, ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తామని అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించేందుకు సమన్వయంతో పనిచేయాలని డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి సూచించారు. కార్యక్రమంలో సర్కిల్–51 అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
