కార్మిక ఉద్యమ నేత పసుపులేటి వెంకటేశ్వరావుకు ఘన నివాళి
– కొండాపూర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో సంతాప సభ
– ఆశయ సాధనకు కట్టుబడి ఉంటామని నేతల ప్రతిజ్ఞ
శేరిలింగంపల్లి – విశాల భారతి
హైదరాబాద్ నగర కార్మిక ఉద్యమంలో విశిష్ట సేవలు అందించిన సీపీఎం సీనియర్ నాయకుడు కామ్రేడ్ పసుపులేటి వెంకటేశ్వరావు అకాల మరణానికి సంతాపంగా కొండాపూర్‌లో సోమవారం సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సీపీఎం నాయకులు చల్లా శోభన్, కొంగరి కృష్ణ మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణ, శ్రమజీవుల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వెంకటేశ్వరావు జీవితాంతం అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. కార్మిక ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.వెంకటేశ్వరావు మరణం సీపీఎంకు మాత్రమే కాకుండా నగర కార్మిక ఉద్యమానికి తీరని లోటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరింత పట్టుదలతో పోరాటాలు కొనసాగిస్తామని పార్టీ శ్రేణులు సంకల్పం వ్యక్తం చేశాయి.
