కూకట్‌పల్లిలో బహిరంగ ప్రదేశంలో అసాంఘిక కార్యకలాపాలు
– భాగ్యనగర్‌లో అల్లూరి ట్రేడర్స్ వద్ద పోలీసుల దాడులు
– 19 మంది మహిళలు అదుపులోకి
సైబరాబాద్ – విశాల భారతి
కూకట్‌పల్లి పోలీస్, ఎస్‌వోటీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 19 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. మెట్రో స్టేషన్ సమీపంలోని భాగ్యనగర్‌లో అల్లూరి ట్రేడర్స్ వద్ద రాత్రి సమయంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.పోలీసుల వివరాల ప్రకారం.. బహిరంగ ప్రదేశంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించడంతో అక్కడ ఉన్న 19 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. పురుషులను ఆకర్షించేలా సంకేతాలు చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు.ముందస్తు సమాచారంతో కూకట్‌పల్లి పోలీసులు, ఎస్‌వోటీ సిబ్బంది సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని గుర్తించి విచారణ చేపట్టారు. అనంతరం 19 మంది మహిళలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. బహిరంగ ప్రదేశాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
