పద్మారావుకు బీజేపీ నేత వడ్డేపల్లి నివాళి
– దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని ఘన నివాళులు
కూకట్ పల్లి – విశాల భారతి
ప్రముఖ రాజకీయ నాయకుడు, సినీ నిర్మాత కీ.శే. గొట్టిముక్కుల పద్మారావు దశదిన కర్మ సందర్భంగా గురువారం వారి నివాసంలో ఏర్పాటు చేసిన సంతాప కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ, పద్మారావు రాజకీయ, సినీ నిర్మాణ రంగాల్లో విశిష్ట సేవలు అందించి ప్రజల మన్ననలు పొందిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ప్రజలతో ఆత్మీయంగా మెలుగుతూ సమాజాభివృద్ధికి కృషి చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
