A place where you need to follow for what happening in world cup

- Advertisement -

సికింద్రాబాద్‌లో కిడ్నాపైన బాలుడు లభ్యం  

0 139

సికింద్రాబాద్‌లో కిడ్నాపైన బాలుడు లభ్యం
– జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో సురక్షితం
– తల్లిదండ్రులకు అప్పగించేందుకు సిద్ధం

సైబరాబాద్ – విశాల భారతి
గత నెల 20న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కిడ్నాప్‌కు గురైన బాలుడి ఆచూకీ లభించింది. షేక్ అహ్మద్ అలీ అనే ఆ చిన్నారి ప్రస్తుతం జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో సురక్షితంగా ఉన్నాడు. మరికొద్దిసేపట్లో బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అదృశ్యమైన బాలుడి కోసం రైల్వే, సిటీ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో నెల రోజులుగా దర్యాప్తు కొనసాగించారు. ఈ క్రమంలో బాలుడు జీడిమెట్ల పరిధిలో ఉన్నట్లు గుర్తించి స్టేషన్‌కు తరలించారు. బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్య పరీక్షలు పూర్తి చేశామని అధికారులు తెలిపారు.

సీఐ ఆప్యాయత..
జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్ బాలుడిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా పలకరించారు. భయంతో ఉన్న చిన్నారిని బుజ్జగిస్తూ, ఫోన్ చూపిస్తూ మరల్చారు. చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి ప్రేమగా మాట్లాడి ధైర్యం చెప్పారు. “తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాం. వారు రాగానే చట్టప్రకారం అప్పగిస్తాం” అని సీఐ మల్లేష్ తెలిపారు. బాలుడిని కిడ్నాప్ చేసిన వారు ఎవరు, కారణాలేంటి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో పిల్లల భద్రతపై మరింత నిఘా పెంచుతామని అధికారులు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.