రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా బొల్లంపల్లి విజయభాస్కర్ రెడ్డి
– అగ్ర నేతలకు కృతజ్ఞతలు: ప్రజాసేవకు అంకితమవుతానని వెల్లడి
సైబరాబాద్ – విశాల భారతి
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా బొల్లంపల్లి విజయభాస్కర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాధ్యత అప్పగించినందుకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జగదీశ్వర్ గౌడ్‌తో పాటు సీనియర్ నాయకులకు విజయభాస్కర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిబద్ధతతో పని చేస్తానని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలు, నాయకుల ఆశీస్సులు, మద్దతు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.
