A place where you need to follow for what happening in world cup

- Advertisement -

ఈ బొమ్మ ఇంకెన్నాళ్లు ‘సజ్జు’సార్

0 1,111

– దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా ఐబొమ్మ రవి కేసు
– అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకోవడంపై విమర్శలు
– సీపీ సజ్జనార్‌కి సినీ పెద్దలంటే ఎందుకంత ప్రేమ
– ప్రధాన పత్రికలు వరుస కథనాలు ప్రచురించడంపై మండిపాడు
– పత్రికలు ప్రజా సమస్యలపై ప్రశ్నించాలి
– సమాజానికి అవసరమైన వాటిపై ఫోకస్ చేయాలి
– పైరసీ తప్పయితే టికెట్ల రేట్లు పెంచుకోవడం కూడా తప్పే
– వినోదం పేరుతో బిజినెస్ చేస్తున్నారు కదా..?
– నేరాల నియంత్రణపై సీపీ ఫోకస్ చేయాలని మీమ్స్

విశాలభారతి స్టేట్ బ్యూరో: నాల్గవ ఎస్టేట్ గా పేర్కొనబడుతున్న పత్రికలు ప్రజాస్వామ్య సౌధానికి మూలాధారంలో ఒకటి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల గురించి ఆచరించే విధానాల గురించి ప్రజలకు తెలియజేసేవి పత్రికలు, అదేవిధంగా ప్రభుత్వ నిర్ణయాల పట్ల ప్రజల స్పందన ప్రభుత్వానికి అందించే ముఖ్యమైన సాధనాలు కూడా పత్రికలే. కావున పత్రికలు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తాయి. పత్రికల ద్వారా ప్రజాస్వామ్యంలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగి సమర్థవంతమైన పరిపాలన అందించడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకే అమెరికాలాంటి ప్రజాస్వామ్య సమాజంలో పత్రికలను ప్రత్యామ్నాయ ప్రభుత్వంగా, ప్రజాకోర్టుగా పేర్కొంటారు. ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య సమాజంలోనైనా పత్రికలు ఈ కింది విధులను నిర్వహిస్తాయి. ముఖ్యంగా అవి సమాజంలో జరుగుతున్న సంఘటనల పరిణామాల తాలూకు సమగ్ర సమాచారాన్ని పౌరులకు అందజేయడం. వాటి ప్రాధాన్యతను పత్రికలు విశ్లేషించాలి లేదా వాటికి భాష్యం చెప్పాలి. సంపాదకీయాలు, వ్యాసాలు ప్రచురించాలి. మనకు వర్తమానంలో అందిన సామాజిక వారసత్వాన్ని రానున్న తరాలవారికి అందజేయాలి. అదేవిధంగా వినోదాన్ని కలిగిస్తూ మానసిక ఒత్తిడిని తగ్గించాలి. కావున పత్రికల సామాజిక బాధ్యత అసమానమైనది. మరి అంత గొప్ప సామాజిక బాధ్యత నిర్వర్తించడానికి పత్రికల తీరు నేటి కాలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పత్రికలు అని చెప్పుకుంటుంటున్న కొన్ని సంస్థలు రాష్ట్రంలోని ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ప్రజావసరం లేని కథనాలను మొదటి పేజీలో ముద్రిస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తాయి.

ఈ విషయంలో పోలీసులు కూడా తక్కువేమితినలేదు.. తెలంగాణలో క్రైమ్ రేటు ఇటీవల పెరిగింది, ముఖ్యంగా 2024 వార్షిక నివేదికల ప్రకారం.. మొత్తం నేరాల పెరుగుదల 2023తో పోలిస్తే 2024లో తెలంగాణలో మొత్తం నేరాలు సుమారు 22శాతం పెరిగాయి, మొత్తం 1,69,477 కేసులు నమోదయ్యాయి. మరొక నివేదికలో ఈ పెరుగుదల 9.87శాతంగా ఉంది, మొత్తం 2,34,158 కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరాల సంఖ్య అత్యంత వేగంగా పెరిగింది. 2023లో 17,571 కేసులు నమోదు కాగా, 2024లో 25,184 కేసులతో ఏకంగా 43.33శాతం పెరుగుదల నమోదైంది. మహిళలపై నేరాలు 4.8శాత పెరిగాయి, అత్యాచారం కేసులు 28.94శాతం పెరిగి 2,945కి చేరుకున్నాయి. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, ఫోర్జరీ, మోసాలు, ఆస్తి సంబంధిత నేరాలు కూడా గణనీయంగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మొత్తం నేరాలు 2024లో 41శాతం పెరిగాయి.

రాష్ట్రవ్యాప్తంగా నేరాల సంఖ్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు అధికారులు రాష్ట్రంలో నేరాల రేటు తగ్గిందని పేర్కొనగా, ప్రతిపక్షాలు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి పాలనలో క్రైమ్ రేట్ 22శాతం పెరిగిందని డీజీపీ చెప్పినట్లు ఆరోపించాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక ప్రకారం తెలంగాణలో నేరాలు, ఘోరాలు గతంతో పోలిస్తే పెరిగినట్లు, ముఖ్యంగా హత్యలు, అత్యాచారాలు, రోడ్డు ప్రమాదాలు, ఫోర్జరీ మోసాలు పెరిగినట్లు కొన్ని నివేదికలు తెలిపాయి. 2017 మరియు 2023 మధ్య పిల్లలపై జరిగే నేరాలు దాదాపు 71శాతం పెరిగాయని, 2020- 2024 మధ్య కాలంలో 45.55శాతం పెరుగుదల నమోదైందని ఒక ఎన్జీఓ విశ్లేషణ తెలిపింది. 2024 వార్షిక నివేదిక ప్రకారం తెలంగాణలో మొత్తం నేరాలు 22.53శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో, 2025లో కూడా నేరాలను అదుపు చేయడానికి పోలీసులు కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత వ్యవస్థలు , ఇతర ఆధునిక సాంకేతికతలను ఉపయోగించాలని యోచిస్తున్నారు. వీటికి తోడుగా ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు పెరిగిపోయాయి.

అంతేకాకుండా రాష్ట్రంలో ఇటీవల కాలంలో బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నవంబర్ 2025లో అనేక ప్రమాదాలు నమోదయ్యాయి, వీటిలో కొన్ని ప్రాణనష్టాన్ని కూడా కలిగించాయి. 2025 నవంబర్ 20న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని నేషనల్ హైవే-44పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. 2025 నవంబర్ 16న వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఇసుక లారీని ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. 2025 నవంబర్ 3న రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ప్రమాదంలో, కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో 19 (కొన్ని వార్తల ప్రకారం 24) మంది ప్రాణాలు కోల్పోయారు. అతివేగం, తప్పు దిశలో రావడం ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలు. తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రమాదాలలో ఒకటిగా 2018 సెప్టెంబరులో జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఘాట్‌ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదాన్ని పేర్కొనవచ్చు, ఇందులో 64 మంది మరణించారు.

పోలీస్​ స్టేషన్​ అంటే అక్కడ సామాన్యుడికి కూడా న్యాయం జరగాలి. అయితే ఈ ఠాణాల్లో మాత్రం న్యాయం కావాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే. అక్కడ డబ్బులు లేనిదే న్యాయం అనేది జరగదనే విమర్శలు వస్తున్నాయి. ఈక్రమంలోనే తాజాగా హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తీరు తీవ్ర చర్చనీయాశంగా మారింది. పనికిమాలిన ఐబొమ్మ పైరసీ కేసును పట్టుకొన్ని నానా హంగామా చేస్తున్నారని అంటున్నారు. ఇక పోలీసులు చేసిన ఈ పనిని ప్రశంసించడానికి సినీ ఇండస్ట్రీ ఏకమైంది. టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్స్, నిర్మాతలు అందరూ కలిసి హైదరాబాద్ సీపీ సజ్జనార్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెల్ లో సజ్జనార్ తో సినీ పెద్దలు భేటీ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు తదితరులు సజ్జనార్ ని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇక ప్రెస్ మీట్ లో సజ్జనార్ తో పాటు సినీ ప్రముఖులు సైతం పాల్గొన్నారు. అయితే ఇలాంటి న్యాయం సామాన్యులకు జరగుంతా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అసలు సనీ పెద్దలకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏంటని అంటున్నారు. సినీ ప్రముఖలపై ఉన్న శ్రద్ధ కాస్త సామాన్య ప్రజలపై కూడా పెట్టాలని చెబుతున్నారు. ఇదే చొవరతో సినిమా టికెట్ రేట్లు తగ్గించి, వారి దోపిడీని అరికట్టి, సామాన్యలుకు వినోదం అందేలా చూడలని హితబోధ చేస్తున్నారు. రాష్ట్రంలో సంచలనంగా మారిన ఎన్ని కేసులు పరిష్కరించారో చెప్పాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

పైరసీ తప్పయితే సినిమా టికెట్ల రేట్లు పెంచడమూ తప్పే.. ఒక ఇంట్లో నలుగురం సినిమాకు పోతే మూడు వేలు ఖతం అవుతున్నాయి.. ఐ బొమ్మలో ఫ్రీగా ఇంటిల్లిపాదీ సినిమా చూస్తున్నం.. అంటున్నారు నెటిజెన్లు.. ఇంతకు సినిమా నిర్మాతలను వందల కోట్లు పెట్టి ఎవరు సినిమాలు తీయుమన్నారంటూ ప్రశ్నిస్తున్నారు..? మొన్నటి ప్రెస్ మీట్ లో ఐ బొమ్మ రవిని ఎన్ కౌంటర్ చేయాలన్న నిర్మాత సీ కల్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసిన తప్పుల చిట్టాను ఎత్తి చూపుతున్నారు. పైరసీ చేసే వాళ్లు సంఘ సేవల చేయట్లేదన్న ఎస్ఎస్ రాజమౌళికీ నెటిజెన్లు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీరేమైనా సంఘ సేవ చేస్తున్నారా..? వినోదం పేరుతో బిజినెస్ చేస్తున్నారు కదా..? మిమ్మల్ని విదేశాలకు వెళ్లి ఎవరు షూటింగులు చేయుమన్నారని ప్రశ్నిస్తున్నారు.. వందల కోట్లు పెట్టి ఎవరు సినిమా తీయుమన్నారంటూ సీరియస్ అవుతున్నారు. సినిమాను పైరసీ చేయడం తప్పయితే టికెట్ల రేట్లు పెంచుకోవడం కూడా తప్పే అని ముక్త కంఠంతో వాదిస్తున్నారు.

మధ్యతరగతి దేవుడు ఐ బొమ్మ రవి.. ఆయన ఇండియన్ రాబిన్ హుడ్.. ఠాగూర్ సినిమాలో చిరంజీవి.. శివాజీ సినిమాలో రజనీకాంత్.. ఇవి నెటిజెన్ల పొగడ్తలు. ఇటీవల పైరసీ సినిమాల కేసులో అరెస్టయిన ఇమ్మడి రవికి సోషల్ మీడియా వేదికగా మద్దతు పెరుగుతోంది. అదే సమయంలో అరెస్టు చేసిన పోలీసులకు వ్యతిరేకంగా మీమ్స్ కూడా వస్తున్నాయి. ఐబొమ్మ రవినిన అరెస్టు చేసిన 24 గంటల్లో బప్పం టీవీ, ఐ బొమ్మ వెబ్ సైట్లు క్లోజ్ అయ్యాయి. అయితే బొమ్మ1 టీవీ పేరుతో మరో వెబ్ సైట్ ఓపెన్ అయినట్టు తెలుస్తోంది. ఐబొమ్మ రవికి నెటిజెన్ల నుంచి పెద్ద సపోర్ట్ లభిస్తోంది. ఏకాణ తీసుకోకుండా కొత్త సినిమాలు చూపిస్తున్నాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మధ్య తరగతి దేవుడనీ పోస్టులు పెడుతున్నారు. ఠాగూర్ సినిమాలో చిరంజీవి మాదిరిగా తారీఫ్ చేస్తున్నారు. అరెస్టు చేసిన పోలీసుపై ఏకంగా మీమ్స్ చేస్తున్నారు. దీనిపై సీపీ సజ్జనార్ మండిపడ్డారు. ఐ బొమ్మ రవిని అరెస్టు చేస్తే ప్రజలు తమపై మీమ్స్ చేస్తున్నారని, వారిపైనా కేసులు పెడతామంటూ హెచ్చరించారు. దీనిపైనా నెటిజెన్లు గట్టిగానే స్పందించారు. బంగారం దుకాణంలో చోరీ జరిగితే షాపు యజమానులను పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెడతారా..? సీపీగారూ..? అంటూ ప్రశ్నిస్తున్నారు. నిర్మాతలు, సినిమా హీరోలు, దర్శకులతో కలిసి సీపీ సజ్జనార్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని తప్పు పడుతున్నారు. ఐ బొమ్మ రవి రియల్ హీరో అని రియల్ రాబిన్ హుడ్ అని పేర్కొంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.