A place where you need to follow for what happening in world cup

- Advertisement -

వైకుంఠ ఏకాదశిపై టీటీడీ బోర్డు కీలక నిర్ణయం

0 406

విశాలభారతి: తిరుమల వైకుంఠ ఏకాదశి, పరకామణి చోరీ కేసుపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థాన ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయిస్తామని తెలిపింది.

దీంతో సామాన్య భక్తులకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థాన (టీటీడీ) పాలక మండలి సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. మొదటి మూడు రోజులు రూ.300, శ్రీవాణి దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 2 నుంచి 8 వరకు రోజుకు 15 వేలు రూ.300 దర్శన టిక్కెట్లు, 1000 శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యులర్‌ పద్ధతిలో కేటాయిస్తున్నట్లు చెప్పారు.

మొదటి మూడు రోజులకు ఈ-డిప్ ద్వారా టోకెన్ల కేటాయింపు జరుగుతుందన్నారు. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు దర్శన టోకెన్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. డిసెంబర్ 2న డిప్ ద్వారా ఎంపికైన వారికి టోకెన్లు జారీ చేస్తామన్నారు. మిగతా రోజులకు జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు రోజుకు 15 వేల రూ.300 దర్శన టిక్కెట్లు, 1000 శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యూలర్ పద్ధతిలో కేటాయిస్తామన్నారు.

పరకామణిచోరీ ఘటనపై తిరిగి కేసు నమోదుచేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక తీర్మానం చేశారు. 900అమెరికన్‌ డాలర్లచోరీ కేసు వెనుక కుట్రదారులనుతేల్చేలా విచారణ జరగాలనితీర్మానించారు. లోక్‌అదాలత్‌లోరాజీ వెనుక కుట్రదారులనుతేల్చేలా విచారణ జరగాలన్నారు. గతంలోనమోదైన కేసు పరిధి పరిమితంగాఉండడంతో మరో కేసు నమోదుకునిర్ణయించారు. మరిన్నిచోరీలు, దుర్వినియోగాలదృష్ట్యా క్రిమినల్‌ కేసునమోదు చేయాలన్నారు. తిరుమలపోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయాలని నిర్ణయం తీసుకున్నారు.

పది రోజులకు 8 లక్షల మందికి దర్శనం చేయిస్తామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. ఏకాదశి రోజున 75 వేలు, రెండో రోజు 78 వేలు, మూడో రోజు 68 వేల మంది దర్శనం చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. మిగతా రోజులు సర్వ దర్శనానికి నేరుగా భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు.

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల ఫిబ్రవరి కోటా టికెట్లను భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఈనెల 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు వీటిని బుక్‌ చేసుకోవచ్చు. మరోవైపు తిరుమలలో ఘాట్ రోడ్డులో ఓ వ్యక్తిపై రాయి పడటంతో గాయాలయ్యాయి. గత రాత్రి నుంచి వర్షం పడుతుండటంతో రెండో ఘాట్ రోడ్డులో బండరాళ్లు జారిపడ్డాయి. ఇదే సమయంలో తిరుపతి నుంచి తిరుమలకు రెండో ఘాట్‌ రోడ్డు మార్గం నుంచి వెళ్తున్న టీటీడీ ఒప్పంద ఉద్యోగి లోకేశ్​పై రాయి పడింది. అతను రోడ్డుపై పడి స్పహ కోల్పోయాడు. సమాచారం అందుకున్న ఘాట్ సిబ్బంది అంబులెన్స్‌లో తిరుమల అశ్వినీ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.